జూనియర్ కళాశాలలకు ఫైర్ సేఫ్టీ నిబంధనలు నుండి తాత్కాలిక ఉపశమనం

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలకు ఈ విద్యా సంవత్సరంలో ఫైర్ సేఫ్టీ నిబంధన నుండి తాత్కాలికంగా ఉపశమనం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

జీవో నెంబర్ 29 ప్రకారం 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలలో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలలో కచ్చితంగా తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ హైదరాబాద్ నుండి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఆ నిబంధనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Follow Us@