సీజేఎల్స్ జూన్, జూలై వేతనాలకు లైన్ క్లియర్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లకు సంబంధించిన జూన్, జూలై వేతనాలకు సంబంధించిన ఆథరైజేషన్ ఇస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికీ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లు రెన్యువల్ కానప్పటికీ ఆర్థిక శాఖ ఇచ్చిన మెమో ఆధారంగా జూన్, జూలై మాసాలకు కు సంబంధించిన బడ్జెట్ ను రిలీజ్ చేస్తూ ఇంటర్మీడియట్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకనుండి నెలనెలా వేతనాలు సక్రమంగా, సమయానికి అందేలా జిల్లా ఇంటర్ విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని, అలాగే వేతనాలకు సంబంధించి ఇంతకు ముందు విడుదల ఉపయోగించబడని బడ్జెట్ వివరాలను వెంటనే కమిషనరేట్ కు తెలియజేయాలని ఉత్తర్వులలో ఇంటర్మీడియట్ కమిషనర్ పేర్కొన్నారు.

అలాగే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కింద పని చేస్తున్న 72 మంది నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలలకు సంబంధించిన బడ్జెట్ ఆథరైజేషన్ ను విడుదల చేయడం జరిగింది.

AUTHORIZATION COPY

Follow Us @