హైదరాబాద్ (జూన్ – 29) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూలై 1న నిర్వహిస్తున్న గ్రూప్ 4 పరీక్ష సందర్భంగా పరీక్ష కేంద్రాలు గల విద్యాసంస్థలకు జూలై 1న సెలవు ప్రకటిస్తూ (July 1st holiday for educational institutions in telangana) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సెలవు దినం బదులుగా రెండో శనివారం పని దినంగా పరిగణించనున్నారు.
దాదాపు 8 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్న నేపథ్యంలో… పలు విద్యాసంస్థల్లో పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేసిన సందర్భంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.