హైదరాబాద్ (జనవరి – 19) : రాష్ట్రంలోని మరో 444 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించి గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా మారుస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు (JPS SERVICE REGULARIZATION) జారీ చేసింది.
గత సెప్టెంబరు వరకు 3,563 మంది జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ జరిగింది. తాజాగా డిసెంబరు నెలాఖరు వరకు మరో 444 మంది నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకోవడంతో వారి క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
దీంతో మొత్తం 4007 మంది జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ పూర్తియింది. రాష్ట్రంలో మరో 2596 జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ జరగాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది.