బీసీ ఇంటర్ గురుకులాల్లో జూన్ 10 లోగా కళాశాలలో చేరాలి

హైదరాబాద్ (జూన్ – 05) : మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకులాల ఇంటర్మీడియట్ కళాశాలలో 2023 – 24 విద్యా ప్రథమ సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించిన బీసీ ఆర్జెసి సెట్ ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసింది.

ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు జూన్ 10వ తేదీ లోపు కేటాయించిన కళాశాలలో ధ్రువీకరణ పత్రాలతో చేరాలని సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు ఒక ప్రకటనలో తెలిపారు.