హైదరాబాద్ (జనవరి – 03) : తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 676 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ లను విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలతో ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు.
జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ వంటి 5 విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
◆ ఖాళీల వివరాలు :
- ప్రాసెస్ సర్వర్ – 163
- రికార్డు అసిస్టెంట్ – 97
- జూనియర్ అసిస్టెంట్ – 277
- ఫీల్డ్ అసిస్టెంట్ – 77
- ఎక్జామినర్ – 66
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి – 11 – 2023
◆ దరఖాస్తు చివరి తేదీ : జనవరి – 31 – 2023
◆ పరీక్ష తేదీ : మార్చి – 2023
◆ అర్హతలు :
- ప్రాసెస్ సర్వర్ – పదవ తరగతి ఉత్తీర్ణత
- రికార్డు అసిస్టెంట్ – ఇంటర్మీడియట్
- ఎక్జామినర్ – ఇంటర్మీడియట్
- జూనియర్ అసిస్టెంట్ – డిగ్రీ
- ఫీల్డ్ అసిస్టెంట్ – డిగ్రీ
◆ వయో పరిమితి : జూలై – 01 – 2022 నాటికి 18 – 34 సంవత్సరాల మద్య ఉండాలి (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)
◆ ఎంపిక విధానం : అర్హత స్థాయిలో ప్రశ్నల స్థాయి ఉంటుంది. 100 మార్కుల పరీక్ష లో 60 మార్కులు జనరల్ నాలెడ్జ్, 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్)
- ప్రాసెస్ సర్వర్ – రాత పరీక్ష (45 మార్కులు) ఇంటర్వ్యూ (5 మార్కులతో) ఉంటుంది.
- రికార్డు అసిస్టెంట్ : రాత పరీక్ష – 100 మార్కులకు
- జూనియర్ అసిస్టెంట్ : రాత పరీక్ష – 100 మార్కులకు
- ఫీల్డ్ అసిస్టెంట్ : రాత పరీక్ష – 100 మార్కులకు
- ఎక్జామినర్ – రాత పరీక్ష – 100 మార్కులకు
◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD FILE BELOW
◆ దరఖాస్తు ఫీజు : 600/- (SC, ST, EWS లకు 400/-)