తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

తెలంగాణ హైకోర్టులో 65 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. జ‌డ్జిలు, రిజిస్ట్రార్ల ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీలు, కోర్టు మాస్ట‌ర్ పోస్టుల‌ను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు.

అర్హత : దేశంలోని ఏ యూనివ‌ర్సిటీ నుంచైనా డిగ్రీ లేదా లా విద్య‌ను అభ్య‌సించి ఉండాలి.

● వయోపరిమితి : 2022, జులై 1 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలి. 34 ఏండ్ల వ‌య‌సు మించ‌రాదు. (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరికి చెందిన అభ్య‌ర్థుల‌కు వ‌యో ప‌రిమితి సడలింపు ఇచ్చారు.)

● దరఖాస్తు ఫీజు : ఓసీ, బీసీ కేట‌గిరిల వారు రూ. 800 చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరి అభ్య‌ర్థులు రూ. 400 చెల్లించాలి. డీడీల‌ను ది రిజిస్ట్రార్(రిక్రూట్‌మెంట్‌), తెలంగాణ హైకోర్టు పేరిట తీయాలి.

★ చివరి తేదీ : ద‌ర‌ఖాస్తుల‌ను స్పీడ్ పోస్టు లేదా కొరియ‌ర్ ద్వారా జులై 22న సాయంత్రం 5 గంట‌ల్లోపు తెలంగాణ హైకోర్టుకు పంపాలి.

● ఎంపిక విధానం : షార్ట్ హ్యాండ్ టెస్టు

● వెబ్సైట్ : https://tshc.gov.in/

● పూర్తి నోటిఫికేషన్ : pdf download

Follow Us @