పిబ్రవరి నుండి ఉద్యోగ నోటిఫికేషన్ లు

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ శాఖలలో 50 వేలకు పైగా ఉద్యోగాల నియమాకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

దీంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శాఖల వారీగా ఖాళీలను నిర్దిష్ట పార్మాట్ లో త్వరగా సమర్పించవలసినదిగా రాష్ట్రంలో ని అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షలో ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. అలాగే చేస్తానన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ లు పిబ్రవరి నుండి విడుదల కానున్నాయని తెలిపారు. దీని కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా, రామకృష్ణ రావు, రజత్ కుమార్ సభ్యులుగా కమిటీ వేయడం జరిగింది.

Follow Us@