ఏటా జాబ్ కేలండర్ కు కేబినెట్ ఆమోదం

ప్రగతి భవన్‌లో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు ఏటా జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ఇదే అంశంపై చర్చించేందుకు రేపు మధ్యాహ్నం 2గంటలకు మరోమారు సమావేశం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. కొత్త జోనల్‌ వ్యవస్థ మేరకు ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు చేపట్టనున్నారు. నూతన జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని కేబినెట్‌ ఆదేశించింది.