NVS LEST 2023 : నేడే నవోదయ 11వ తరగతి ప్రవేశ పరీక్ష

హైదరాబాద్ (జూలై – 22) : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023 – 24 విద్యా సంవత్సరం కోసం పదకొండవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం లేటరల్ సెలక్షన్ ఎంట్రీ పరీక్షను ఈరోజు దేశవ్యాప్తంగా (NVS LEST 2023 EXAM CONDUCTING JULY 22nd) నిర్వహించనున్నారు.

ఈ ప్రవేశ పరీక్షను ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

మణిపూర్ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఈ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ను జూలై – 31 వరకు పొడిగించారు. పరీక్ష తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు.

◆ వెబ్సైట్ : https://cbseitms.nic.in/2023/jnvxi?AspxAutoDetectCookieSupport=1