హైదరాబాద్ (మే 13) : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023 – 24 విద్యా సంవత్సరం కోసం పదకొండవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం లీటరల్ సెలక్షన్ ఎంట్రీ పరీక్ష (NVS LEST 2023) ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుచున్నారు.
◆ అర్హతలు : నవోదయ విద్యాలయం పనిచేస్తున్న జిల్లాలో 2022 – 23 లో పదవ తరగతి పాస్ అయి ఉండాలి. జూన్ – 01 – 2006 నుండి జూలై- 31 – 2008 మధ్య జన్మించి ఉండాలి.
◆ ఎంపిక విధానము : రాత పరీక్ష ద్వారా, (మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ సైన్స్.)
◆ దరఖాస్తు గడువు : మే – 31- 2023
◆ పరీక్ష తేదీ : జూలై – 22 – 2023
◆ వెబ్సైట్ : https://cbseitms.nic.in/2023/jnvxi?AspxAutoDetectCookieSupport=1