Home > JOBS > TELANGANA JOBS > JLM – జేఎల్ఎం పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయండి – హైకోర్టు

JLM – జేఎల్ఎం పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయండి – హైకోర్టు

BIKKI NEWS (MARCH -1) : తెలంగాణ రాష్ట్ర విద్యుత్శా ఖలో మిగిలిపోయిన 553 జేఎల్ఎం పోస్టులను పరీక్షలకు హాజరైన వారిలో మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని (JLM POSTS FILLED WITH MERIT LIST SAYS HIGH COURT) తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) ను హైకోర్టు ఆదేశించింది.

జేఎల్ఎం నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు, స్థానికత వర్తించదని వ్యాఖ్యానించింది. స్తంభాలు ఎక్కే పరీక్ష నిర్వహించి వారితో పోస్టులను భర్తీ చేయాలని, వారు లేని పక్షంలో పరీక్ష నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేసింది.

2019లో టీఎస్ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పోస్టులను భర్తీ చేయడాన్ని సవాల్ చేస్తూ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఉప్పరి తిరుమలేశ్ తోపాటు
మరికొందరు హైకోర్టులో 2020లో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మాధవీదేవి గురువారం తీర్పు వెలువరించారు.

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి. ప్రకాశ్ రెడ్డి, న్యాయవాదులు సుంకర చంద్రయ్య, చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి. రాష్ట్రపతి ఉత్తర్వులను జేఎల్ఎం పోస్టులకు వర్తింపజేయలేరని, మిగిలిన ఖాళీలను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని ఆదేశించారు.