ఒప్పంద/అతిధి అధ్యాపకులు పనిచేస్తున్న పోస్టులు ఖాళీలే.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉన్న ఖాళీలను తెలపాలని బిక్షు నాయక్ అనే సమాచారం హక్కు చట్టం కార్యకర్త సమాచారం హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు ఇంటర్మీడియట్ బోర్డ్ సమాదానంగా పలు విషయాలను వెల్లడించింది.

  • 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంకా 4055 టీచింగ్ పోస్టుల ఖాళీలు ఉన్నాయని తెలిపింది.
  • ఈ పోస్టులో 3652 మంది కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు పనిచేస్తున్నారని తెలిపింది.
  • మిగతా పోస్టులు అతిధి అధ్యాపకులు పని చేస్తున్నారని తెలిపింది.
  • కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులు ప్రతి సంవత్సరం తమ సబ్జెక్టులో డిస్ట్రిక్ట్ యావరేజ్ సాదించి రెన్యూవల్ అవుతున్నారని తెలిసింది.
  • వీరికి 37,100 వేల వేతతం ఇస్తున్నట్లు తెలిసింది.
  • 2014 నుండి కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులను నియామకాలు లేవని, ప్రస్తుతం పనిచేస్తున్న వారు గతంలో నియమించబడినవారే అని తెలిపింది.
  • అతిధి అధ్యాపకులకు తరగతికి 300 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నట్లు పేర్కొంది.
  • ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తే ఈ 4055 ఖాళీలను కూడా భర్తీ చేస్తామని తెలిపింది.
Follow Us@