పదోన్నతి పొందిన జూనియర్ లెక్చరర్ లకు హర్దిక శుభాకాంక్షలు – TIGLA – జంగయ్య, రామకృష్ణ గౌడ్.

ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , కమీషనర్ ల యొక్క ప్రత్యేక చొరవతో ప్రిన్సిపాల్స్ గా పదోన్నతి పొందిన 139 మంది జూనియర్ లెక్చరర్ లకు TIGLA తరపున అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, రామకృష్ణ గౌడ్ లు హర్దిక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య చరిత్రలోనే దళారీల, బ్రోకర్ల అవినీతిపరుల, పైరవీకారుల ప్రమేయం లేకుండా జూనియర్ అధ్యాపకులకు ప్రిన్సిపాల్ గా పదోన్నతులు రావడం DPC List, SC/ ST రోస్టర్, ఖాళీల లిస్టు ప్రకటన, TIGLA పోరాటం వల్లనే మాత్రమే సాధ్యమైందని తెలిపారు.

TIGLA అంటేనే “ఆత్మగౌరవం” అని ఏమి చెబుతుందొ – అదే చేస్తుంది, ఏది చేస్తుందో -అదే చెబుతుంది మరియు నీతి నిజాయితిలతో పనిచేస్తూ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను కాపాడుకోవడమే లక్ష్యం గా పని చేస్తోందని తెలిపారు.

జోన్ వారీగా జూనియర్ అధ్యాపకుల సీనియార్టీ లిస్టులు తయారీ లో గాని, ప్రస్తుతం పనిచేస్తున్న అతిధి అధ్యాపకులను ఈ విద్యాసంవత్సరం కూడా కొనసాగించే విషయంలో గాని, 10% కోటాలో నాన్-టీచింగ్ స్టాఫ్ కు జూనియర్ అధ్యాపకులుగా పదోన్నతుల కొరకు దరఖాస్తులు కోరడంలో గాని TIGLA ప్రముఖ పాత్ర పోషించిందని తెలిపారు.

అలాగే ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలు కచ్చితంగా జరుగుతాయి అని జంగయ్య, రామకృష్ణ గౌడ్ తెలిపారు.

Follow Us@