జేఎల్ టూ డిఎల్ పదోన్నతులకు నోటిఫికేషన్.

తెలంగాణ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హత ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లు, లైబ్రేరియన్స్‌, ఫిజికల్ డైరెక్టర్ల్ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలంగాణ కాలేజీ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లు, లైబ్రేరియన్స్‌, ఫిజికల్ డైరెక్టర్లు కనీసం మూడు సంవత్సరాలు సర్వీస్ పూర్తిచేసి ఉండాలి, మరియు మాస్టర్ డిగ్రీలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే సంబంధిత సబ్జెక్టులో నెట్, స్లెట్, పీహెచ్డీ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో సీనియార్టీ లిస్టు తయారు చేసి రోస్టర్ పద్ధతిలో పదోన్నతులు ఇవ్వబడును.

అలాగే గతంలో ప్రమోషన్ పొంది తిరిగి జూనియర్ కళాశాలలకు వెళ్లిన అభ్యర్థులకుదరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు.

దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 31 2020 కాలేజీయోట్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది.

Follow Us@