జూనియర్ లెక్చరర్ పోస్టుల కన్వర్షన్, షిఫ్టింగ్ కు అనుమతి

తెలంగాణ రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ ఐదు పోస్టుల కన్వర్షన్ తో పాటు షిఫ్టింగ్ కు అనుమతి ఇస్తూ ఇంటర్ విద్య కమిషన్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు.

  • ఖమ్మం జిల్లా కామేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గణితం పోస్టును చరిత్ర (హిస్టరీ)
    పోస్టుగా,
  • ఖమ్మం బాలికల జూనియర్ కాలేజీలో హిస్టరీ/ రాజనీతిశాస్త్రం పోస్టును వాణిజ్యశాస్త్రం (కామర్స్)గా,
  • ఖమ్మం జిల్లా నేలకొండపల్లి జూని యర్ కాలేజీలో అర్ధశాస్త్రం పోస్టును రాజనీతిశాస్త్రం పోస్టుగా,
  • సత్తుపల్లి కాలేజీలో తెలుగు పోస్టును ఉర్దూ పోస్టుగా
  • శ్రీపురం కాలేజీలో సంస్కృతం పోస్టును అర్ధశాస్త్రం పోస్టుగా మార్చేశారు.

ఆయా పోస్టులను ఉర్దూ మీడియం పోస్టులుగా మార్చడమే కాకుండా వాటిని ప్రభుత్వ జూనియర్ కాలేజీ – ఆసిఫాబాద్ కు కేటాయించారు.

Follow Us @