హైదరాబాద్ (డిసెంబర్ – 10) : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ (JL NOTIFICATION QUALIFICATIONS) లో సివిక్స్ సబ్జెక్టు జూనియర్ అధ్యాపకుల కొలువులకు పీజీలో పొలిటికల్ సైన్స్(పీఎస్), పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (పీఏ ) లలో 50 శాతం మార్కులతో పాసైన వారు అర్హులేనని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
టీఎస్‌పీఎస్సీ జూనియర్ అధ్యాపకుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో కొన్ని సందేహాలపై ఆమె స్పష్టత ఇచ్చారు. పదో తరగతి వరకు ఉర్దూ/మరాఠీ లేదా పదో తరగతిలో ప్రథమ భాషగా చదివినా లేదా డిగ్రీలో ద్వితీయ భాషగా వాటిని చదివిన వారు ఉర్దూ/మరాఠీ మీడియాలో జేఎల్ పోస్టులకు అర్హలవుతారని పేర్కొన్నారు.