1392 జూనియర్ లెక్చరర్ పోస్టులు : సబ్జెక్టు వారీగా ఖాళీలు

  • మల్టీ జోన్-1లో 724, -2లో 668 ఖాళీలు టీఎస్ పీఎస్సీ ద్వారా

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భర్తీ చేసే జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల లెక్క తేలింది. మల్టీ జోన్-1లో 724, మల్టీ జోన్-2లో 668.. మొత్తంగా 1,392 పోస్టులను భర్తీ చేయాలని అధికారులు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.

సబ్జెక్టుల వారీగా తీసుకొంటే గణితం, ఇంగ్లిష్ లో అత్యధిక పోస్టులు ఉన్నాయి. ఉర్దూ మీడియంలో 119 పోస్టులు ఉండగా, మరాఠీ మీడియంలో 2 పోస్టులు ఉన్నాయి. ఉర్దూ మీడియంలో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వీటిని టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి లెక్చరర్ల భర్తీని చేపడతారు.

Follow Us @