APPSC : J.L., D.L., ఉద్యోగ నోటిఫికేషన్స్ -ఖాళీల వివరాలు

విజయవాడ (నవంబర్ – 02) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నవంబర్ నెల ఆఖరులోగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ ,పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనుంది ఈ మేరకు చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటన విడుదల చేశారు

డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులు-267, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు- 99, టీటీడీ డీఎల్, జేఎల్-78, జూనియర్ కళాశాలల అధ్యాపకులు-47, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్-38, ఇంగ్లిష్ రిపోర్టర్స్ (ఏపీ లెజిస్లేచర్ సర్వీస్)-10, లైబ్రేరియన్ (కళాశాల విద్య)-23, ఏపీ ఆస్ఈఐ సొసైటీ కింద 10 జేఎల్, 05 డీఎల్ పోస్టులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ 4 డెవలప్మెంట్ ఆఫీసర్, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 4 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

ఇవే కాకుండా… భూగర్భ నీటి పారుదల శాఖ, జిల్లా సైనిక్ వెల్ఫేర్ సర్వీసెస్, ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్, ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఏపీ మున్సిపల్ ఎకౌంట్స్ సబ్ సర్వీసెస్లో జూనియర్ ఎకౌంట్ ఆఫీసర్ కేటగిరీ-2, సీనియర్ ఎకౌంటెంట్ కేటగిరీ-3, జూనియర్ ఎకౌంటెంట్ కేటగిరీ-4 కింద మరికొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను ఈ నెలలోనే ఏపీపీఎస్సీ జారీ చేయనుంది.