వేతనాలు విడుదల పై హర్షం -711 సంఘం జిల్లా నరసింహ

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ల వేతనానికి సంబంధించిన ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల వేతనాలను విడుదల చేస్తూ ఇంటర్మీడియట్ కమీషనర్ ఒమర్ జలీల్ ఆథరైజేషన్ ప్రొసీడింగ్స్ విడుదల చేయడం పట్ల 711 సంఘం తరపున జిల్లా నరసింహ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా నరసింహ మాట్లాడుతూ సకాలంలో వేతనాలు చెల్లింపు జరిగే విధంగా వేతనాలు విడుదల చేయించడానికి కృషి చేస్తున్న ఉన్నత విద్యా జేఏసీ చైర్మైన్ సీహెచ్ కనకచంద్రంకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, కమీషనర్ ఒమర్ జలీల్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

జేఏసీ చైర్మన్ సీహెచ్ కనకచంద్రం ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న వేతనాలు, నెలనెల సకాలంలో వేతనాలు మరియు 10% టీడీఎస్ కోత లేకుండా వేతనాలు అందేలా కృషి జరుగుతుందని జిల్లా నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు.