JEE MAINS 3వ విడత పరీక్ష అడ్మిట్‌ కార్డుల విడుదల

JEE MAINS 3వ విడత పరీక్ష అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కరోనా కారణంగా వాయిదా పడిన 3వ విడుత జేఈఈ జూలై 20, 25 తేదీల్లో జరగనుంది. ఇందులో ఇంజినీరింగ్‌ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మాత్రమే పరీక్షకు మాజరవుతారు.

4వ విడుత జేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈ పరీక్షను జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు ఇంజినీరింగ్‌తో పాటు ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌ అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరు కానున్నారు

వెబ్సైట్‌ :: jeemain.nta.nic