JEE MAINS 2024 – నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడువు

హైదరాబాద్ (నవంబర్ – 30) : JEE MAINS 2024 APPLICATION DATE నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే జేఈఈ మెయిన్ తొలి విడత ఆన్లైన్ పరీక్షలకు దరఖాస్తు గడువు నవంబర్ 30వ తేదీ రాత్రి 9.00 గంటలకు ముగియనుంది.

దేశవ్యాప్తంగా దాదాపు 8.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.50 లక్షల మంది దరఖాస్తు చేయనున్నారు. గత జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్ – 2023 తొలి విడత పేపర్-1కు (బీటెక్ లో ప్రవేశానికి) 8.60 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 8.24 లక్షల మంది పరీక్షలు రాశారు.