JEE MAINS – 2021 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన రమేష్ పోఖ్రియాల్

దేశవ్యాప్తంగా గందరగోళానికి గురి చేసిన JEE MAINS – 2021 పరీక్షల షెడ్యూల్ విడుదల చివరికి ఈరోజు కేంద్ర విద్యా శాఖా మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటనతో గందరగోళానికి తెరపడింది.

కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు JEE MAINS – 2021 పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. మొదటి విడత పరీక్ష తేదీలను ఫిబ్రవరి 23 నుండి 26 వరకు నిర్ణయించారు.

మొత్తంగా ఈ సంవత్సరం నాలుగు విడతలుగా తెలుగుతో సహా 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అలాగే 90 ప్రశ్నలకు గాను 75 ప్రశ్నలకు జవాబు రాయాల్సి ఉంటుందని విద్యాశాఖ మంత్రి తెలిపారు.

మిగతా మూడు విడతల పరీక్షలు మార్చి, ఎప్రిల్, మే నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Follow Us@