నేటి నుండి JEE MAINS రెండవ విడత పరీక్షలు

జేఈఈ మెయిన్‌ 2021 రెండో విడత పరీ‌క్షలు నేటి నుంచి ప్రారం‌భం‌మై 18 తేదీ వరకు నిర్వహిస్తారు. కంప్యూ‌టర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT) విధా‌నంలో జరిగే ఈ పరీక్షలను బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవే‌శాల కోసం నిర్వహిస్తారు.

ఈ పరీ‌క్షలు రెండు సెష‌న్లల్లో జరు‌గు‌తాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.

రెండో విడత జేఈఈ మెయిన్‌ కోసం దేశ‌వ్యా‌ప్తంగా 5 లక్షల మంది విద్యా‌ర్థులు దర‌ఖాస్తు చేసు‌కోగా, తెలం‌గాణ నుంచి 53 వేల మంది విద్యా‌ర్థులు పరీక్ష రాయ‌ను‌న్నారు.

పరీక్ష రాసే విద్యా‌ర్థులు పర్సనల్‌ వాట‌ర్‌‌బా‌టిల్‌, హ్యాండ్‌ శాని‌టై‌జర్‌, బాల్‌‌పా‌యింట్‌ పెన్‌, జేఈఈ అడ్మి‌ట్‌‌కార్డు, ఫేస్‌‌మాస్క్‌, గ్లౌజులు, ఫొటో ఐడీ ఫ్రూఫ్‌‌లను మాత్రమే వెంట‌తె‌చ్చు‌కో‌వా‌లని నేష‌నల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) సూచించింది.

Follow Us@