JEE MAINS 4వ విడుత షెడ్యూల్ మార్పు

JEE MAINS 4వ విడుత షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. పరీక్షలు ఆగస్ట్‌ 26, 27, 31, సెప్టెంబర్‌ – 1, 2వ తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ గురువారం తెలిపారు.

మూడు, నాలుగో విడుత JEE MAINS మధ్య సమయం ఇచ్చామని, ఈ మేరకు వ్యవధిని ఇవ్వాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే దరఖాస్తుల గడువును జూలై 20 వరకు పొడగించినట్లు చెప్పారు.