హైదరాబాద్ (ఎప్రిల్ – 15) : JEE MAIN చివరి విడత పరీక్ష ఫలితాలు ఎప్రిల్ 29వ తేదీన విడుదల కానున్నాయి. ఈనెల 6 నుంచి ప్రారంభమైన చివరి విడత మెయిన్ పరీక్షలు శనివారంతో ముగుస్తాయి. జనవరిలో జరిగిన తొలి విడత మెయిన్, తాజా పరీక్షల్లో సాధించిన ఉత్తమ స్కోర్ ను (రెండు సార్లు రాసి ఉంటే) పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) ర్యాంకులు కేటాయించనుంది. జేఈఈ మెయిన్ లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు.
JEE ADVANCED జూన్ 4వ తేదీన జరిగనుంది. ఈ పరీక్ష రాయడానికి ఈనెల 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని ఐఐటీ గువాహటి ప్రకటించింది.
జనవరిలో జరిగిన తొలివిడత జేఈఈ మెయిన్కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా వారిలో 8.24 లక్షల మంది హాజరయ్యారు. చివరి విడతకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
★ అడ్వాన్ కు 2022 మెయిన్ లో కటాఫ్ స్కోర్..
◆ జనరల్ (అన్ రిజర్వుడ్): 88.4121383
◆ ఈడబ్ల్యూఎస్ : 63.1114141
◆ ఓబీసీ : : 67.0090297
◆ ఎస్సీ: 43.0820954
◆ ఎస్టీ: 26.7771328