జేఈఈ మెయిన్, నీట్ – 2021 పరీక్షలను సిలబస్ తగ్గించి నిర్వహించే యోచన.

కరోనా నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరంలో సరిగ్గా తరగతులు నిర్వహించని విషయం తెలిసింది. చాలా రాష్ట్రాలలో ఇంకా విద్యా సంస్థలు తెరచుకొని విషయం తెలిసిందే.

JEE MAIN 2021, నీట్ 2021 పరీక్షల నిర్వహణపై ఈ అంశాలు ప్రభావితం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10 వ తారీఖున కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ సోషల్ మీడియాలో లైవ్ నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులు మరియు నిపుణుల అభిప్రాయం తీసుకొనున్నారు. ఆ తర్వాత పరీక్షల తేదీల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా సి బి ఎస్ సి ఎక్సామ్ బోర్డ్ మరియు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యా బోర్డులతో సంప్రదింపులు జరిపి అభిప్రాయాలను తీసుకోనుంది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభిప్రాయం ప్రకారం JEE MAIN – 2021, NEET – 2021 పరీక్షలకు సిలబస్ ను తగ్గించి, పరీక్ష తేదీలను మార్చే అవకాశం ఉంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ కు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.

Follow Us@