హైదరాబాద్ (డిసెంబర్ – 02) : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE ADVANCED) అడ్వాన్స్డ్-2023 పరీక్షలు కొత్త సిలబస్ తో జరగనున్నాయి. జాయింట్ అడ్మిషన్ బాడీ (JAB) కొత్త సిలబస్ ను విడుదల చేసి అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in లో పొందుపరిచింది.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మూడు సబ్జెక్టుల్లోనూ సిలబస్ మార్చింది. పాత సిలబస్ లోని కొన్ని అధ్యాయాలను తొలగించి, కొత్తగా కొన్ని చేర్చారు. జేఈఈ మెయిన్ అనుసంధానంగా ఉండేలా నూతన సిలబస్ ను రూపొందించారు.
◆ పరీక్ష విధానం :
కొత్త విధానంలో ప్రవేశ పరీక్ష పార్ట్-ఎ, పార్ట్-బిలుగా రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్-ఎ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. మూడు విభాగాలలో ప్రశ్నలు ఉంటాయి. న్యూమరికల్ ఆన్సర్ టైప్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ (ఎన్ఏటీ, ఎంఎస్క్యూ, ఎమ్సీక్యూ) ఉంటాయి. పార్ట్-బి లో రెండు ప్రశ్నలు ఉంటాయి. ఒకటి డ్రాయింగ్, మరొకటి డిజైన్ ఆప్టిట్యూడ్. పార్ట్ – బి లోని ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్ పై కనిపించేలా ఇస్తారు. అభ్యర్థులు దానికి సమాధానాన్ని ఇన్విజిలేటర్ అందించిన జవాబు పుస్తకంలో మాత్రమే రాయాలి. ప్రశ్నలకు సంబంధించిన డ్రాయింగ్ అందులోనే చేయాలి.
◆ సిలబస్ మార్పు :
- గణితంలో కొత్తగా గణాంకాలు (స్టాటిస్టిక్స్)ను జోడించారు. దీనికి బదులుగా త్రిభుజం పరిష్కారం (సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్) అంశాన్ని తొలగించారు.
- భౌతిక శాస్త్రంలో సెమీకండక్టర్లు, కమ్యూనికేషన్ అంశాలను మినహా యించారు. వీటికి బదులుగా జేఈఈ మెయిన్ లోని కొన్ని అంశాలు జోడించారు. మెయిన్ లోని ఫోర్స్‌డ్ అండ్ డాంపడ్ అసిల్లేషన్, ఈఎమ్ వేవ్స్, పోలరైజేషన్ అంశాలను కొత్త సిలబస్ లో చేర్చారు.
- కెమిస్ట్రీలోనూ మార్పులు చేశారు.
కొత్త సిలబస్ ఎక్కువగా సీబీఎస్ఈ అంశాలను చేర్చారు. దీనివల్ల సీబీఎస్ఈ విద్యార్థులకు కొంత సులువుగా ఉంటుందని, ఇంటర్మీడియట్ చదివే వారికి కొంత ఇబ్బందికరమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Follow Us @