ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష

న్యూఢిల్లీ (ఆగస్టు 16) : దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన అడ్వాన్స్డ్ పరీక్ష ఈనెల 28న నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. జేఈఈ మెయిన్స్ లో మెరుగైన ఫలితాలు సాధించిన 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాసే అవకాశం ఉన్నది.

2021లో జేఈఈ అడ్వాన్ కు దరఖాస్తు చేసుకొని పరీక్షకు హాజరుకాలేని వారికి ఈ ఏడాది పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. 2 రౌండ్ల పరీక్షకు గైర్హాజరైన వారికే ఇది వర్తిస్తుందని ఐఐటీ బాంబే పేర్కొంది

Follow Us @