న్యూఢిల్లీ (జూన్ – 04) : దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో (IIT) ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2023 EXSM) ప్రవేశ పరీక్ష ఈరోజు రెండు సెషన్స్ లలో జరగనుంది.
మొదటి సెషన్ ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా దాదాపు 1.9 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.