JNVS 6th ADMISSIONS : దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్ (ఆగస్టు – 09) : దేశవ్యాప్తంగా ఉన్న 649 జవహర్ నవోదయ విద్యాలయ(JNV)లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును ఆగస్టు 17 వరకు పొడిగించినట్లు (JAWAHAR NAVODAYA VIDYALAYA SAMITHI 6th CLASS ADMISSIONS DATE EXTENDED) నవోదయ విద్యాలయ సమితి ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 జవహర్ నవోదయా విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.

పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి