జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష తేదీ ప్రకటన

దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ ప్రకటించింది.

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. JNV ప్రవేశ పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌ ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుంది. ప్రవేశ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.

పూర్తి వివరాలకు వెబ్సైట్ :: https://cbseitms.nic.in/index.aspx