BIKKI NEWS : ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (james Anderson) (621*) భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(619)ను అత్యధిక టెస్ట్ వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో అధిగమించాడు.
గురువారం కోహ్లి (0)ని ఔట్ చేయడం ద్వారా 619 వికెట్లతో కుంబ్లే సరసన నిలిచిన అండర్సన్ శుక్రవారం ఓపెనర్ కె.ఎల్.రాహుల్ (84) వికెట్‌తో కుంబ్లేను దాటేశాడు. ఇప్పుడు టెస్టుల్లో మురళీధరన్ (శ్రీలంక; 800), షేన్‌వార్న్ (ఆసీస్; 708), తర్వాత స్థానం అండర్సన్‌దే. అతని ఖాతాలో 621 వికెట్లున్నాయి. కుంబ్లే (619) నాలుగో స్థానంలో ఉన్నాడు.