BIKKI NEWS (NOV. 16) : Jake Paul beats Mike Tyson. ప్రపంచ మాజీ హెవీ వెయిట్ చాంపియన్ మైక్ టైసన్ ప్రత్యర్థి జేక్ పౌల్ చేతిలో ఓడిపోయాడు. ఓ జడ్జి 80-72 స్కోర్ ఇచ్చాడు. మరో ఇద్దరు జడ్జీలు 79-73 స్కోరుతో పౌల్‌కు విక్టరీని అందజేశారు.
Jake Paul beats Mike Tyson
మొత్తం 8 రౌండ్ల మ్యాచ్‌లో టైసన్ పెద్దగా ప్రదర్శన చేయలేకపోయాడు. జేక్ పౌల్ పంచ్‌లకు టైసన్ చాలా సార్లు దొరికిపోయాడు. గట్టిగా దెబ్బలు తగులుతున్నా.. వాటి తట్టుకుని టైసన్ ఎదురుదాడికి ప్రయత్నించాడు. ఏడవ రౌండ్‌లో టైసన్ కుడివైపు జేక్ పవర్‌ఫుల్ పంచ్ ఇచ్చాడు.
టెక్సాస్‌లో జరిగిన బిగ్ బౌట్‌లో.. 58 ఏళ్ల టైసన్ తన కన్నా 37 ఏళ్ల చిన్నోడైన జేక్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు.
2005లో ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి టైసన్ రిటైర్ అయిన విషయం తెలిసిందే. రింగ్‌లో అతను ఇప్పటి వరకు కేవలం ఆరుసార్లు మాత్రమే ఓడాడు. వయసుకు తగ్గ ఫైట్ కాకపోయినా.. టైసన్ మాత్రం తనలో దాగిన ఐరన్ గుండెను ప్రదర్శించాడు. 8వ రౌండ్ చివరలో టైసన్ ముందు తలవంచాడు పౌల్. అతనికి గ్లౌజ్‌లు ఇచ్చేశాడు టైసన్. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పౌల్ విజేతగా నిలిచాడు.