Home > UNCATEGORY > విద్యార్థుల జ్ఞాన అభివృద్ధి కోసం పాఠశాలకు దినపత్రికల వితరణ

విద్యార్థుల జ్ఞాన అభివృద్ధి కోసం పాఠశాలకు దినపత్రికల వితరణ

BIKKI NEWS (JAN. 03) : jai bheem foundation donates newspapers to zphs kallem. మహా సాధ్వి, భారత దేశ తొలి ఉపాధ్యాయుని, సంఘ సంస్కర్త మాత సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – కళ్ళెంకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి అధ్యక్షతన జై భీమ్ ఫౌండేషన్ – కళ్ళెం యూత్ ఆధ్వర్యంలో విద్యార్థుల జ్ఞాన అభివృద్ధి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాలకు రెండు దిన పత్రికలు దాత దళితరత్న అవార్డు గ్రహీత మబ్బు పరశురామ్ లెక్చరర్ గారు వేయించడం జరుగుతుంది.

jai bheem foundation donates newspapers to zphs kallem

ఈ సందర్భంగా ఫౌండేషన్ యువకులు మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విద్యలో రాణించి పాఠశాలకు, ఊరు మరియు తల్లితండ్రుల మంచి పేరు తీసుకురావాలని మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఫౌండేషన్ ఉపాధ్యక్షులు మబ్బు నవీన్, ఫౌండేషన్ యువకులు మబ్బు క్రాంతి కుమార్, కొల్లురి సుమన్, మబ్బు అశోక్, జీడికంటి కరుణాకర్, మబ్బు కనకరాజు, తిప్పారపు అజయ్ మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు