జగిత్యాల జిల్లా మోడల్ స్కూళ్లలో ఉద్యోగాలు

జగిత్యాల (జూలై – 02) : జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి‌, కథలాపూర్ మోడల్ స్కూళ్ళలో హవర్లీ బేస్డ్ పద్దతిలో PGT, TGT పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటనలు విడుదల చేశారు.

★ పెగడపల్లి మోడల్ స్కూల్ :

పెగడపల్లి ఆదర్శ మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి (హవర్లీ బేస్డ్) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రవి శనివారం ప్రకటనలో
తెలిపారు.

6 నుంచి 8 వరకు టీజీటీ తెలుగు పోస్టు – 1 ఖాళీ ఉందని, (అర్హత ఎంఏ తెలుగు, బీఎడ్ తెలుగు మెథడాలజీ లేదా టీఈటీ బీఏ తెలుగు),

9 నుంచి ఇంటర్ సెకండియర్ వరకు పీజీటీ తెలుగు పోస్టులు – 2 (అర్హత ఎంఏ తెలుగు, బీఎడ్ తెలుగు మెథడాలజీ),

6 నుంచి 8 వరకు టీజీటీ ఇంగ్లిష్ పోస్టు -1 ( అర్హత ఎంఏ ఇంగ్లిష్, బీఎడ్ ఇంగ్లిష్ మెథడాలజీ),

8 నుంచి 10వ తరగతి వరకు టీజీటీ హిందీ పోస్టులు – 2 (అర్హత ఎంఏ హిందీ, హెచ్పీటీ లేదా బీఏ హిందీ విద్వాన్)
ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో జూలై 5న మోడల్ స్కూల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించే డెమోకు హాజరు కావాలని కోరారు.

◆ కథలాపూర్ మోడల్ స్కూల్ :

కథలాపూర్ మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు హావర్లీ బేసిస్ శాలరీపై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నరేశ్ తెలిపారు. పీజీటీ (తెలుగు), టీజీటీ(గణితం, హిందీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

పీజీటీ పోస్టుకు పీజీతోపాటు బీఎడ్, టీజీటీ పోస్టుకు డిగ్రీతోపాటు బీఎడ్ పూర్తి చేసి టెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. జూలై 5లోగా పాఠశాలలో విద్యార్హత జిరాక్స్ పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.