జగిత్యాల (జూలై – 20) : జిల్లాలోని నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల పోస్టులకు నోటిఫికేషన్ కళాశాలల కమిషనరేట్ వారు విడుదల చేశారు. అందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ. అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.
జగిత్యాల పట్టణంలోని ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్లము 1, పొలిటికల్ సైన్స్ 1, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్ 1
జగిత్యాల పట్టణంలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్లము 1, తెలుగు 1, కంప్యూటర్ సైన్స్ &అప్లికేషన్ 1,
కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు 1, హింది 1, గణితం 1, కంప్యూటర్ అప్లికేషన్ 1 డైరీ సైన్స్ 1,
మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర 1, పొలిటికల్ సైన్స్ 1, కంప్యూటర్ సైన్స్ &అప్లికేషన్ 1, కామర్స్ 1.
పై పోస్టులకు ఆయా కళాశాలల్లో ఈ నెల 25 తేదీ లోగా అర్హులైన వారినుండి దరఖాస్తులు కోరు తున్నట్లు ఆయన తెలిపారు.
మరింత సమాచారం కొరకు అకాడమిక్ కో ఆర్డినేటర్ 98855 88419 సంప్రదించవచ్చని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.