17న జిల్లా కేంద్రాలలో ఉపాధ్యాయుల సామూహిక నిరాహార దీక్షలు

తెలంగాణ రాష్ట్రం లోని ఉపాధ్యాయుల పదోన్నతులు మరియు బదిలీల సాధనే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆప్ టీచర్స్ ఆర్గనైజేషన్(JACTO) మరియు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) స్టీరింగ్ కమిటీ లు సంయుక్తంగా చేస్తున్న పోరాటంలో భాగంగా డిసెంబర్ 9 10 వ తారీకులలో పాఠశాలలో “భోజన విరామంలో నిరసన” తెలిపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో హక్కుల సాదన పోరాటానికి కొనసాగింపుగా డిసెంబర్ 17 వ తేదీన జిల్లా కేంద్రాలలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు “సామూహిక నిరాహార దీక్షలు” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్టీరింగ్ కమిటీ పిలుపునిచ్చింది.

అలాగే డిసెంబర్ 29వ తేదీన రాష్ట్ర స్థాయిలోహైదరాబాద్ లో జరిగే “మహాధర్నా”కు సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు స్టీరింగ్ కమిటీ పిలుపునిచ్చింది.

ప్రస్తుత పోరాటం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు మరియు బదిలీల సాధన కోసం మాత్రమేనని, మిగతా సమస్యలైన పి ఆర్ సి, సి పి ఎస్ రద్దు, సమాన పనికి సమాన వేతనం, హెల్త్ కార్డులు వంటి వాటి కోసం కోసం మరో పోరాటాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యవేదిక తో కలిసి త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

Follow Us@