ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జాక్టో USPC ఉద్యమం

తెలంగాణ రాష్ట్రం లోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జాక్టో మరియు USPC సంఘాలు దశలవారీ ఉద్యమం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

గత ఐదు సంవత్సరాలుగా బదిలీలు, పదోన్నతులు లేక ఇబ్బంది పడుతున్న తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జాక్టో మరియు UPSC రాష్ట్ర నాయకత్వం దశలవారీ ఉద్యమానికి సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో దశలవారీ ఉద్యమానికి సంబంధించిన నోటీసును ప్రభుత్వానికి అందజేసింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్య, అంతర్ జిల్లా, అంతర్రాష్ట్ర బదిలీలు పదోన్నతులు మొదలైన వివిధ సమస్యలపై డిసెంబర్ మాసంలో జాక్టో మరియు UPSC సంయుక్తంగా దశలవారీగా ఉద్యమ ప్రణాళికను విడుదల చేశాయి.

● గత సంవత్సరం 10,479 మంది ఉపాధ్యాయులను స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి గావించిన ఇంత వరకు ఆ ఖాళీలలో పోస్టింగ్ ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు.

● ఏడు సంవత్సరాలు గడిచినా మోడల్ స్కూల్ టీచర్లకు ఇంతవరకు బదిలీలు లేకపోవడం విచారకరమన్నారు.

● 2019 లో పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి విన్నవించగా సానుకూలంగా స్పందించి, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు.

◆ దశల వారీ ఉద్యమం

2020 డిసెంబర్ 8, 9 తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు జరుపుతామని.

2020 డిసెంబర్ 17న జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులతో కలిసి నిరాహార దీక్షలు చేస్తామని.

2021 డిసెంబర్లో రాష్ట్రస్థాయిలో మహా ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా జాక్టో UPSC ప్రతినిధులు ప్రకటించారు.

Follow Us@