ఐటీఐ లు ఇక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ – సీఎం రేవంత్ రెడ్డి

BIKKI NEWS (JUNE 18) : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తెలంగాణలోని 65 ఐటీఐలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ( ITIs now skill development centers )తీర్చిదిద్దే మహాత్తర కార్యక్రమానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తెలిపారు.

ITIs now skill development centers

ఈ 65 ఐటీఐలను టాటా టెక్నాలజీస్ సంస్థ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చే ప్రాజెక్టునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో భూమి పూజ చేసి ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నీళ్లు, నిధులు ,నియామకాలు అని నినాదంతో సాగిందని… ఆ మేరకే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని గుర్తు చేశారు. వారికి చేదోడు వాదోడుగా ఉండేందుకే అడ్వాన్స్ స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు, వీటి ద్వారా నిరుద్యోగులు శిక్షణ పొంది మంచి ఉద్యోగాలను పొందుతారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

గల్ఫ్ దేశాలకు తెలంగాణ యువత వలసల నిరోధించే విధంగా ఇక్కడ కూడా అలాంటి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే కోర్సుల వలన ఉపాధి అవకాశాలు దొరకడం లేదని, అందుకే రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలను తీసుకువచ్చి ఈ సెంటర్లలో శిక్షణ ఇప్పిస్తామని తద్వారా ఉన్నతమైన నైపుణ్యాలను పొందిన యువత ఉపాధి అవకాశాలు సులభంగా దక్కించుకుంటారని తెలిపారు.

ఐటీఐ ల అప్‌గ్రేడ్ కోసం 2324.21 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తుందని, ఇందులో ప్రభుత్వ వాటా 307.96 కోట్లు కాగా, టాటా టెక్నాలజీస్ వాటా 2016.25 కోట్లు గా ఉండనుంది.

ఈ శిక్షణ కేంద్రాలలో ఏటా 15,860 మందికి 6 రకాల కోర్సుల్లో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. అలాగే 31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

JOB NOTIFICATIONS

OUR TELEGRAM CHANNEL LINK