IT RETURNS : రేపటితో ముగుస్తున్న గడువు – దాఖలు చేయకుంటే చర్యలు

హైదరాబాద్ (జూలై – 30) : ఆదాయ పన్ను రిటర్న్ (IT RETURNS) సమర్పణకు గడువు జూలై 31 తో ముగుస్తుంది. 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో అర్ధించిన ఆదాయానికి ప్రస్తుత మదింపు సంవత్సరం 2023 – 24 రిటర్న్ దాఖలు చేయాలి.

ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుంది. గత ఏడాది వీరి సంఖ్య 7.4 కోట్లకు చేరినట్లు ఆర్థిక మంత్రి ఇటీవల పార్లమెంట్ లో ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 5.35 కోట్ల మంది ఐటి రిటర్న్ దాఖలు చేసినట్లు సమాచారం. ఇంకా ఐటీ రిటర్న్ లు దరఖాస్తు చేయవలసిన వారి సంఖ్య భారీగానే ఉంది.

◆ ఆపరాధ రుసుము :

గడువు తేదీలోపు ఐటీ రిటర్న్ దాఖలు చేయకపోతే అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు 1,000 రూపాయలు… అంతకుమించి ఆదాయం ఉన్నవారు 5,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పన్ను చెల్లించాల్సిన వారు నెలకి ఒక శాతం సాధారణ వడ్డీని సైతం చెల్లించాలి. అలాగే ఐటీ శాఖ నోటీసులను పంపించి.. 50% నుండి 200% వరకు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారు.