విద్యార్థులకు అన్ని సర్టిఫికెట్ లు జారీ చేయాలి – ఇంటర్ బోర్డు

హైదరాబాద్ (ఆగస్టు – 19) : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు కళాశాల విడిచి వెళ్ళే విద్యార్థులకు అన్ని సర్టిఫికెట్ లను ఇచ్చేయాలని ఏ కారణం చేతనైన సర్టిఫికెట్ లను నిలుపుదల చేయవద్దని ఇంటర్కమీషనర్ ఒమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా డీఐఈవోలు మరియు ఇంటర్ విద్యా అధికారులు అన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలను తనిఖీ చేయాలని మరియు ఏ కళాశాల ఏ కారణం చేతనైనా ఏ విద్యార్థుల సర్టిఫికేట్‌లను నిలిపివేయకుండా చూసుకోవాలని ఆదేశించారు. అలాగే ఏ కళాశాల అయినా సర్టిపికేట్ల జారీలో అశ్రద్ధ వహిస్తే బోర్డు కు పిర్యాదు చేయాలని తెలిపారు.

ఈ నేపథ్యంలో విద్యార్థులకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్ల జారీకి సంబంధించి నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి పునరుద్ఘాటించింది.

Follow Us @