ISRO – LVM3 – వన్ వెబ్ – 2 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట (మార్చి – 26) : తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి LVM3 మార్క్-3(LVM3-M3) రాకెట్ నుంచి వన్ వెబ్ – ఇండియా 2 మిషన్ కి చెందిన 36 సమాచారం ఉపగ్రహలను ఇస్రో (ISRO) విజయవంతంగా ప్రయోగించింది.

ఈ ప్రయోగం ద్వారా యూకేకు చెందిన కౌంటెన్ నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ, భారత్ కు చెందిన భారతి ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా వన్ వెబ్ ఇండియా – 2 పేరుతో రూపొందించిన 5,805 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్ లో 87.4 డిగ్రీల వంపులో వృత్తాకార కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.