శ్రీవారి కోట ( అక్టోబర్ 23) : బ్రిటన్ కు చెందిన వన్ వెబ్ యొక్క 36 కమ్యూనికేషన్ శాటిలైట్ లను ఇస్రో విజయవంతంగా అక్టోబర్ 23 న కక్ష్యలలోకి ప్రవేశపెట్టింది. LVM3 – M2 మిషన్ లో బాగంగా NSIL (న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్) సహాఃమకారంతో ప్రయోగాన్ని చేపట్టింది.
అక్టోబర్ 23, 00..07 నిమిషాలు కు ప్రయోగం జరిగింది. ఇది ఇస్రో చేపట్టిన వాణిజ్య పరంగా అతి పెద్ద ప్రయోగం. LVM3 మిషన్ మొదటి ప్రయోగం. దాదాపు 6 టన్నుల బరువు ఉన్న శాటిలైట్ లను కక్ష్య లోకి విజయవంతంగా ప్రయోగించారు.