ISRO (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) జీశాట్ – 24 ఉపగ్రహాన్ని విజయవంతంగా ఈరోజు కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ కంపెనీ ఏరియన్ స్పేస్ ఫ్రెంచ్ గయానా (దక్షిణ అమెరికా)లోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్‌తో ఇస్రో రోదసీలోకి పంపింది.
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్), కేంద్ర ప్రభుత్వం తరఫున డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్(డీఓఎస్) సంయుక్తంగా 4,180 కిలోల బరువు కలిగిన జీశాట్–24 ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టాయి.
ఈ ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చి డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చేందుకు పాన్ ఇండియా కవరేజీతో రోదసీలో పంపారు. జీశాట్–25తో డీటీహెచ్ అప్లికేషన్‌లో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్ష రంగ సంస్కరణల తర్వాత న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) ప్రారంభించిన డిమాండ్ ఆధారిత కమ్యూనికేషన్ శాటిలైట్ మిషన్ ఇదేకావడం విశేషం.
సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ నెల 30న సాయంత్రం 6 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ53 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నది.
Follow Us @