తిరుపతి (మే – 29) : సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ – షార్ నుండి ISRO ఈరోజు ఉదయం 10.42 గంటలకు GSLV – F12 వాహకనౌక ద్వారా NVS-01 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
GSLV – F12 రాకెట్ బయలు దేరిన తర్వాత 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కి.మీ. ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టనుంది.
భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో NVS-01 మొదటిది. 2,232 కిలోల బరువున్న దీని జీవితకాలం 12 సంవత్సరాలు. ఈ ఉపగ్రహం భారత్ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1,500 కి.మీ పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను అందిస్తుంది.