BIKKI NEWS (JAN. 06) : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ జనవరి 1న పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్‌తోపాటు గగనతలంలోకి పంపిన ఫ్యూయెల్ సెల్‌ను విజయవంతంగా (ISRO FUEL CELL TEST SUCCESS AT SPACE) పరీక్షించింది. అంతరిక్షంలో దాని పని తీరును ఎవిశ్లేషించడంతోపాటు డేటాను సేకరించింది.
భారత అంతరిక్ష కార్యకలాపాల భవిష్యత్తు మిషన్ల కోసం దీనిని అభివృద్ధి చేశారు. ‘పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యూయెల్ సెల్’గా దీనిని వ్యవహరిస్తున్నారు. ఇది రసాయన చర్య జరిపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రమంలో నీటిని మాత్రమే వదులుతుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువుల నుంచి రసాయన చర్య జరిపి 180 వాట్ల శక్తిని విడుదల చేస్తుంది.
అలాగే సిలికాన్ గ్రాఫైట్ ఆనోడ్ బేస్డ్ హై ఎనర్జీ డెన్సిటీ లిథియం అయాన్ సెల్స్ ను కూడా విజయవంతంగా పరీక్షించింది. PSLV C58 – POEM – 3 ఫ్లాట్‌ఫామ్ ద్వారా వీటిని ఇస్రో అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.