ISRAEL IRAN WAR – అణు యుద్ధం అంచున ప్రపంచం

BIKKI NEWS (JUNE 14) : ISRAEL IRAN WAR LEADS TO NUCLEAR WAR. ఇరాన్ అణు శుద్ధి కేంద్రాలే లక్ష్యం గా ఇజ్రాయిల్ దాడులు చేసింది. ముఖ్యంగా న‌టాంజ్ అణు శుద్దీక‌ర‌ణ కేంద్రంపై ప‌లుమార్లు తీవ్రంగా దాడి చేసిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. ఇక్క‌డ అండ‌ర్‌గ్రౌండ్‌లో న్యూక్లియ‌ర్ సైట్ ఉన్న‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది.

ISRAEL IRAN WAR LEADS TO NUCLEAR WAR.

న‌టాంజ్ కేంద్రం నుంచి భారీ స్థాయిలో న‌ల్ల‌టి పొగ వ‌స్తున్న విజువ‌ల్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఏ మేర‌కు డ్యామేజ్ జ‌రిగింద‌న్న దానిపై క్లారిటీ లేదు.

Natanz nuclear station

ఇరాన్‌లోని ఫోర్డోలో కూడా మ‌రో అండ‌ర్‌గ్రౌండ్ న్యూక్లియ‌ర్ సైట్ ఉంది. ఆప‌రేష‌న్ రైజింగ్ ల‌య‌న్‌లో భాగంగా ఇరాన్ అణ్వాయు స్ధావ‌రాల‌పై ఇజ్రాయిల్ అటాక్ చేసింది.

ఇరాన్ వ‌ద్ద 15 అణు బాంబుల‌కు కావాల్సినంత శుద్ది చేసిన యురేనియం ఉన్న‌ట్లు మరియు ళ బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను త‌యారు చేస్తున్న‌ద‌ని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది.

IAEA DECLARES NO RADIATION

న‌జాంట్ అణు కేంద్రంపై దాడి త‌ర్వాత ఆ ప్రదేశంలో ఎటువంటి రేడియేష‌న్ లీక్ జ‌ర‌గ‌లేద‌ని అంత‌ర్జాతీయ అటామిక్ ఎన‌ర్జీ ఏజెన్సీ పేర్కొన్న‌ది. రేడియేష‌న్ లెవల్స్ పెర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు