హైదరాబాద్ (ఆగస్టు 4): ఇంటర్మీడియట్ విద్యార్థులకు పర్యావరణ అంశాలపై ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్టు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీలు, గురుకులాలు, మాడల్ స్కూళ్లల్లోని ఇంటర్ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపింది.
జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు అనుమతిస్తారు. రాష్ట్ర స్థాయి విజేతలకు లాప్ టాప్ బహూకరించనున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
