అహ్మదాబాద్ (మే – 30) : IPL 2023 WINNER CHENNAI SUPER KINGS… ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అసాదరణ ఆటతీరుతో గుజరాత్ టైటాన్స్ ను మట్టికరిపించి 5వ సారి ఐపీఎల్ విజేతగా నిలిచింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్ మెన్ భారీ స్కోర్ 214/4 ను సాధించారు. సాయి సుదర్శన్ 96, సాహ 54, గిల్ 39 పరుగులతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై జట్టు మొదటి ఓవర్లో నే వరుణుడు అడ్డుతగిలాడు. చివరకు మ్యాచ్ ను డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో చెన్నై జట్టుకు 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
చెన్నై ఓపెనర్లు వేగంగా ఆడడంతో కోట్టవలసిన రన్ రేటు కంట్రోల్ తప్పలేదు. గైక్వాడ్ 26, కాన్వే 47 పరుగులు చేసి ఒకే ఓవర్ లో ఔట్ అయినప్పటికీ అజింక్యా రహనే (27) , శివమ్ దూబే, అంబటి రాయుడు (19) విరుచుకుపడ్డారు. చివరి రెండు బాల్స్ లో 10 పరుగులు కావాల్సిన సమయంలో జడేజా సిక్స్, ఫోర్ తో విజయం అందించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా డెవాన్ కాన్వే, ప్లేయర్ ఆప్ ద సిరీస్ గా శుభమన్ గిల్ నిలిచారు.
- NOBEL PRIZE 2024 WINNERS LIST – నోబెల్ 2024 విజేతలు విశేషాలు
- JOBS – ప్రకాశం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు
- Jobs – గద్వాల్ జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు
- Guest Jobs – ఖమ్మం జిల్లా జూనియర్ కళాశాలల్లో గెస్ట్ జాబ్స్
- GK BITS IN TELUGU 10th OCTOBER